ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఫ్రోజన్ ఫుడ్స్ తింటారా..?
నేటి బిజీబిజీ లైఫ్‌లో ఇంట్లో ఆహారం వండుకుని తినేంతటి టైం లేదన్నది వాస్తవమే. దీంతో, యువత మార్కెట్లో ఫ్రిజ్‌లల్లో శీతలీకరించిన ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను కొనుక్కుని తింటుంటారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఆహార నిపుణుల చెప్పే దాని ప్రకారం, ఫ్రిజ్‌లల్లో నిల్వచేసిన ఇలాంటి ఫుడ్స్‌లో రకరకాల ప్రిజర్వేటివ్‌లు జత చేస్తారు. అంతేకాదు, వీటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ వంటి హానికారక కొవ్వులు, స్టార్చ్ పెద్దమొత్తంలో ఉంటాయి. ఆహారం ఎక్కువ రోజులపాటు నిల్వ ఉండేందుకు కారణమైయ్యే వీటితో పలు అనారోగ్య సమస్యలు వస్తాయి
ఇలాంటి ఫుడ్స్‌లోని స్టార్చ్ కారణంగా అరుగుదల సమస్యలతో పాటు డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
ఈ ఫుడ్స్‌తో హృద్రోగాల అవకాశాలు కూడా పెరుగుతాయట. వీటిల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్‌యే ఇందుకు కారణం. ఈ కొవ్వు పదార్థాల వల్ల ఒంట్లో చెడు కొలెస్టెరాల్ పెరిగి మంచి కొలెస్టెరాల్ స్థాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా గుండె జబ్బుల బారిన పడే అవకాశం పెరుగుతుంది. వీటిల్లో అధికంగా ఉండే సోడియంతో బీపీ పెరుగుతుంది.
ఈ తరహా ఆహారాలతో ఊబకాయం బారిన పడే అవకాశాలు గణనీయంగా ఉంటాయి. నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఒక కప్పు ఫ్రోజన్ చికెన్ తింటే 600 కెలొరీలు శరీరంలో చేరతాయి.
ఫ్రిజ్‌లో నిల్వ చేసే ఫ్రోజన్ ఫుడ్స్ కారణంగా క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకానొక అధ్యయనం ప్రకారం ఈ రిస్క్ 65 శాతం ఉంటుందట.
No comments:
Post a Comment