ఊబకాయంతో బాధ పడుతున్నారా..?
అధిక బరువు, ఊబకాయంతో పిల్లలతో సహా పెద్దవారు కూడా బాధ పడుతున్నారు. శరీరంలో అధిక స్థాయిలో కొవ్వు పదార్థం నిల్వ ఉండే పరిస్థితి అధిక బరువుకు కారణం అవుతుంది. ఆరోగ్యకరమైన బరువు కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు రహిత లేదా తక్కువ కొవ్వు పాలు, పాల ఉత్పత్తులు ఆహార పదార్థాలు తీసుకోవాలి. శుద్ధి చేసిన ధాన్యాలు, స్వీట్లు, బంగాళదుంపలు, రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర పానీయాలు వాడకూడదు. జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలి. శుద్ధి చేసిన తెల్ల చక్కెర, మైదా, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, సంతృప్త కొవ్వుతో తయారు చేయబడిన అత్యంత ప్రాసెస్ చేయబడిన ఆహారాన్ని తినకూడదు.
చిన్న ప్లేట్లలో ఆహారాన్ని తినడం వలన బరువు తగ్గవచ్చు. గర్భధారణ సమయంలో పెరిగిన బరువును తగ్గించుకోడానికి పుట్టిన పిల్లలకు 24 నెలల వరకు తల్లి పాలు ఇవ్వాలి. ప్రతి రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒకే దగ్గర కూర్చొని టి.వి చూడడం తగ్గించాలి. సరైన వేళకు ఆహారం తీసుకొని, తగినంత నిద్ర పోయి ఒత్తిడి తగ్గించుకోవాలి. బాల్య స్థూలకాయం మీద దృష్టిపెట్టాలి. కారణం బాల్య స్థూలకాయం యుక్తవయస్సు వరకు కొనసాగే అవకాశం ఉంది.
దీని వల్ల వ్యక్తికి మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆహారపు అలవాట్లను మెరుగు పరచడం, శారీరక శ్రమను పెంచడం లాంటివి ఊబకాయం రాకుండా చేస్తాయి. ఊబకాయం, అధిక బరువులకు చికిత్స చేయడం కష్టం. కాబట్టి నివారణ చాలా ముఖ్యం.
No comments:
Post a Comment