మెట్లు ఎక్కి దిగితే.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!
ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. అయితే సీజన్ మారినప్పుడు వ్యాయామాలు చేసేందుకు వాతావరణం అనుకూలించదు. అలాంటప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం వంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
– మెట్లు ఎక్కడం, దిగడం వంటి వ్యాయామాల వల్ల శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. కానీ ఈ వ్యాయామాలు శారీరక బలంతోపాటు శక్తినిస్తాయి అని వైద్యులు చెబుతున్నారు.
– మెట్లపై చేతులు పెట్టి పైకి కిందకి లేస్తూ చేసే వ్యాయామాలు ఆరోగ్యాన్నిస్తాయి.
– రోజూ మెట్లు ఎక్కుతూ దిగుతూనే ఉంటాం. కానీ ఈ వ్యాయామం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టం. కానీ దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.
– మెట్లపై బాడీని ఏటవాలుగా వంచి ఒక కాలు పైకి లేపుతూ.. దించుతూ వ్యాయామం చేయాలి.
No comments:
Post a Comment