చక్కని ఆరోగ్యానికి చల్లని పానీయాలు
ప్రకృతి పానీయాల గురించి తెలుసుకుని తాగితే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాంటి కొన్ని ప్రకృతి సిద్ధమైన పానీయాల గురించి తెలుసుకుందాం.
నిమ్మాపుదీనా జ్యూస్ :
సోడాలంటే చాలామందికి ఇష్టం. కానీ బయట దొరికే సోడాలన్నీ ఆరోగ్యానికి మంచివి కావు. అవి ఇష్టపడేవారు నిమ్మా పుదీనా జ్యూస్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటే మంచిది. ఒక గ్లాస్ నిమ్మాపుదీనా జ్యూస్ తీసుకుంటే 76 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. వాటిలోని 40 గ్రా.సోడియం, 20.1 గ్రా. కార్బోహైడ్రేట్స్ శరీరానికి మేలు చేస్తాయి.
ఆరెంజ్ స్పోర్ట్స్ డ్రింక్ :
ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే 100 శాతం సహజసిద్ధమైన జ్యూసులు డీ హైడ్రేషన్ నుంచి ఉపశమనాన్ని కల్గిస్తాయి. వాటిలో ముఖ్యమైనది ఆరెంజ్ స్పోర్ట్స్ డ్రింక్ ఒకటి. ఎండలో బాగా కష్టపడే వారికి, ఎక్కువగా అలసటకు గురయ్యే వారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు ఆరెంజ్ స్పోర్ట్స్ డ్రింక్ తాగితే 61 కేలరీల శక్తి అందుతుంది. 162 మిల్లీ గ్రాముల సోడియం, 15.3 కార్బొహైడ్రేట్స్ మీ శరీరానికి అందుతాయి. ఇది జీరో కొలస్ట్రాల్ డ్రింక్.
దానిమ్మ రసం :
ఇంట్లో రెండే రెండు నిముషాల్లో తయారుచేసుకోగల ఈ దానిమ్మ రసం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌తో 75 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. ఈ రసంలో 18.5 గ్రాముల కార్బొహైడ్రేట్స్, జీరో కొలెస్ట్రాలు ఉంటాయి.
వాటర్ మెలన్ చిల్లర్ : వేసవిలో ఎక్కువ మంది ఇష్టంగా తినేది పుచ్చకాయ. దీంతో, జ్యూస్‌ను చాలా సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పుచ్చకాయ, దానిమ్మ, నిమ్మ కాంబినేషన్‌లో తయారుచేసిన ‘వాటర్ మిలన్ చిల్లర్’ జ్యూస్ నోటికి రుచిగా ఉంటుంది. శరీరానికి 87 కేలరీల శక్తిని అందజేస్తుంది. కొలెస్ట్రాలు ఉండవు. గ్లాసు వాటర్‌మిలన్ చిల్లర్‌తో 22.1 గ్రాముల కార్బొహైడ్రేడ్స్, 1.1 గ్రాముల ప్రొటీన్ శరీరానికి అందుతుంది.
పుల్లటి వాటర్ :
వేసవి ఈ పానీయం శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. ఒక గ్లాసు నీటిలో దోసకాయ ముక్క, కొన్ని పుదీనా ఆకులు, నారింజ ముక్కలను ఉంచితో ఈ నీటిని పుల్లటి రుచి వస్తుంది. విటమిన్ సి కూడా అందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన పానీయంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. వేడి దద్దుర్ల నుంచి రక్షిస్తుంది.
నిమ్మకాయ, పుదీనా పానీయం :
ఒక గ్లాసు నీటిలో కొన్ని పుదీనా ఆకులు, నిమ్మముక్కలు ఉంచి 15 నిముషాలు మరిగించాలి. అది చల్లారిన తర్వాత తేనె కలపాలి. ఇది వేసవి వేడి, నిర్జలీకరణం నుంచి మనల్ని రక్షించడానికి దోహదపడుతుంది.
ఆరెంజ్ జ్యూస్ :
ఆరెంజ్ నుంచి జ్యూస్ తీసి దానికి చిటికెడు ఉప్పు కలపాలి. ఈ పానీయంలో విటమిన్ సి, ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. నిర్జలీకరణ నుంచి రక్షిస్తుంది. ఇది కూడా ఉత్తమమైన ఆరోగ్యకరమైన వేసవి పానీయాల్లో ఒకటిగా చెప్పొచ్చు.
వెన్నతీసిన పాలు : ఈ పానీయంలో ప్రొటీన్లు సమృద్ధిగా కేలరీలు తక్కువగా ఉంటాయి. వేడిని తగ్గించటానికి ఇవి దోహదపడతాయి. దాహార్తిని తీరుస్తుంది. ఆకలి పెరుగుతుంది.
పెరుగు పానీయం :
ఒక కప్పు పెరుగులో కొంత నీరు, జీలకర్ర, అల్లం ముక్కలు, చిటికెడు ఉప్పు వేయాలి. ఈ పానీయం తయారుకావటానికి బాగా కలపాలి. దీనిలో మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్). ఆక్సీకరణ, ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది నిర్జలీకరణం నుంచి కాపాడుతుంది.
రోజ్ వాటర్ :
నీటిలో కొంచెం కుంకుమ పువ్వు, తాజా గులాబీ రేకులు వేసి కొంచెంసేపు మరగించాలి. రాత్రిపూట అలా ఉంచి మరుసటి రోజు ఉదయం తేనె కలపాలి. ఈ సీజన్‌లో ఉత్తమ వేసవి పానీయాల్లో ఇది కూడా ఒకటి.
ఐస్‌తో బటర్‌మిల్క్ :
కొంత పెరుగును తీసుకుని దానికి ఉప్పు, కొద్దిగా తేనె, స్ట్రాబెర్రీ గుజ్జు, కొన్ని ఎండిన పుదీనా ఆకులు కలపాలి. చల్లగా కావాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ పానీయాన్ని తీసుకుంటే మనల్ని తాజాగా ఉంచుతుంది.
కర్బూజా, పుచ్చకాయ పానీయం :
కర్బూజా, పుచ్చకాయ ముక్కలను జ్యూసర్‌లో వేసి జ్యూస్ తీయాలి. దీనికి అర స్పూన్ తేనె, చిటికెడు ఉప్పు కలపాలి. కొంచెం జీలకర్ర, తాజా పుదీనా ఆకులను కలపాలి. ఆ తర్వాత సేవిస్తే అధిక చెమటలను తగ్గిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది.
No comments:
Post a Comment