మొబైల్ ఫోన్లను పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్నారా..?
నేటికాలంలో రోజూ నిద్రపోయే ముందు ఫోన్ చూసి పడుకోవడం చాలామందికి అలవాటైపోయింది. ఫోన్‌ని పక్కనే పడుకుని నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. మొబైల్ ఫోన్ల వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అదెలాగో తెలుసుకుందామా..?!
మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే లైటింగ్ మెదడును ఉత్తేజపరుస్తుంది. మొబైల్ ఫోన్లు పక్కనే ఉంటే నిద్రపట్టడం కష్టమవుతుంది. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే కాంతి మెదడులోని మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.
మొబైల్ ఫోన్ నుంచి వెలువడే కాంతిలో రేడియేషన్ ఉంటుంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు కూడా తెలిపాయి. అలాగే మొబైల్ ఫోన్ లైటింగ్‌తో తలనొప్పి వచ్చే అవకాశాలెక్కువ ఉన్నాయి. ఈ కాంతి కంటి సమస్యలకు కూడా కారణమవుతోంది.
రాత్రి వేళల్లో మొబైల్ ఫోన్ మీ పక్కన లేకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు :
– మొబైల్ ఫోన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పడకగదిలోకి తీసుకురావద్దు.
– నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్‌ను ఫ్లయిట్ మోడ్‌లోకి సెట్ చేసుకోండి.
– నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ రింగ్‌టోన్ లేదా నోటిఫికేషన్ టోన్‌లను బంద్ చేయండి.
– మీరు పడుకునే ప్రాంతంలో మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టొద్దు. మీకు దూరంగా ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టండి. ఫోన్‌కి రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేస్తే మొబైల్ బ్యాటరీ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది.
No comments:
Post a Comment