వీటిని తింటే సంతోషం మీ సొంతం..!
నేటి కాలంలో ఐటి రంగంలో పనిచేసే ఉద్యోగులే కాదు.. మిగతా ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా విపరీతమైన పని ఒత్తిడితో నలిగిపోతున్నారు. పని ఒత్తిడి వల్ల సరైన సమయానికి కూడా తినలేకపోవడం వల్ల వారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి ఒత్తిడికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? రోజూ వ్యాయామాలు చేసినా ఒత్తిడి తగ్గకపోతే.. మీ ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే సంతోషం మీ సొంతం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!
సాల్మన్ ఫిష్ : సాల్మన్, ట్యూనా వంటి ఫిష్‌లలో ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇన్‌ప్లమేషన్‌ను తగ్గించి, సంతోషాన్ని పెంచుతాయి.
ద్రాక్ష : నీటిశాతం ఎక్కువగా ఉండే ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. ద్రాక్ష పండ్లను తినడం వల్ల మీరు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు.
అవకాడో : అవకాడోలో విటమిన్ బి6, ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తికి ఎంతగానో సహాయపడతాయి.
బచ్చలికూర : బచ్చలికూరలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగు : పులియబెట్టిన ఆహారాలు తినడంతో ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇడ్లీ, దోస, పెరుగు తినడంతో ఒత్తిడి తగ్గుతుంది. ఆనందం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
No comments:
Post a Comment