నిద్రపోయే ముందు లెమన్ వాటర్ తాగితే బరువు తగ్గుతారా..?
అధిక బరువు ఉన్నవారు.. బరువు తగ్గడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గడానికి కొంతమంది ఆహారం మానేస్తారు. మరికొంతమంది ఫ్రూట్స్, పానీయాల్ని తీసుకుంటూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. నిద్రపోయేముందు లెమన్ వాటర్ తాగితే సులువుగా బరువు తగ్గుతారు అని తాజాగా సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.
ఒక గ్లాసు వేడి నీటిలో లెమన్ జ్యూస్, కొద్దిగా అల్లం రసం, రెండు మూడు లవంగాలు వేసుకుని నిద్రపోయే ముందు తాగితే బరువు తగ్గుతారు అని సోషల్‌మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ నీటిని రోజూ తాగితే బరువు తగ్గుతారు అని కచ్చితంగా చెప్పలేమని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మరసం, అల్లం రసం, లవంగాలు వంటి పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటితో చేసిన నీటిని తీసుకుంటే అధిక బరువు కాకపోయినా.. తక్కువ బరువు తగ్గవచ్చు. ఈ నీరు అందరికి సరిపడుతుందని చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ఈ నీటిని తీసుకుంటే కొందరికి వికారము, వాంతులు కూడా అవ్వొచ్చు. మీరు ఈ నీటిని ఒకసారి తాగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే.. ఈ నీటిని తీసుకోవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment