వేసవి తాపాన్ని తగ్గించే చియా సీడ్స్!
నలుపు, తెలుపు రంగుల్లో మార్కెట్లో లభించే చియా సీడ్స్ వల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడేవారు చియా సీడ్స్‌ని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గుతారని పలు పరిశోధనలు వెల్లడించాయి.
– చియా సీడ్స్‌ని నేరుగా తీసుకోకూడదు. వాటిని నీటిలో నానబెట్టాలి. అలా నానబెట్టిన వాటిని పెరుగులోనూ, సలాడ్స్‌లోనూ వేసుకుని తీసుకోవచ్చు.
– నానబెట్టిన వాటిని ఒక గ్లాసు నీటిలో వేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు లేదా పంచదార, గ్యాస్ వాటర్‌ని పోసుకుని తీసుకోవచ్చు.
– చియా సీడ్స్ వల్ల బరువు మాత్రమే కాదు. వేసవి తాపం నుంచి కూడా ఉపశమనం పొందచ్చు.
– చియా సీడ్స్‌లో ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి జీర్ణక్రియకు ఎంతో దోహదపడతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో సహాయపడతాయి.
No comments:
Post a Comment