మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే డ్రైఫ్రూట్స్ తినకూడదు.. ఎందుకంటే?
డ్రైఫ్రూట్స్ రుచిగా ఉండడమేకాదు… త్వరగా శక్తినిస్తాయి. అందుకే చాలామంది తమ ఆరోగ్యం కోసం డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. అయితే ఐదు రకాల డ్రైఫ్రూట్స్ మాత్రం మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం డ్రైఫ్రూట్స్ తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అత్తిపండ్లు
అత్తిపండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్న ఈ అత్తిపండ్లలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి తీపిగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తింటే అసౌకర్యంగా ఉంటుంది. ఉబ్బరంగా అనిపిస్తుంది. వీటిని ఉదయంపూట తీసుకోకుండా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది.
ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షలో సహజంగానే షుగర్స్ ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్ ముందు ఖాళీ కడుపుతో వీటిని తిన్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదముంది. అందుకే ఉదయాన్నే వీటిని తీసుకోకుండా ఉంటేనే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ వీటిని తినాలనుకుంటే.. రోజులో ఏదో ఒక టైమ్‌లో తీసుకోవచ్చు. వీటిని నేరుగా కాకుండా.. పెరుగుతో కలిపి తీసుకుంటే మంచిది.
ఆప్రికాట్స్
ఎండిన ఆప్రికాట్స్‌లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా వీటిల్లోనూ నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉదయాన్నే కాకుండా.. ఈవినింగ్ స్నాక్స్‌లా తీసుకోవచ్చు. వీటిని చిరుధాన్యాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
ప్రూనె
ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఉండే నేచురల్ షుగర్స్ వల్ల ఇవి తియ్యగానే ఉంటాయి. వీటిని తింటే.. షుగర్ స్థాయిలు పెరుగుతాయి. ప్రూనె పండ్లను కూడా మధుమేహవ్యాధిగ్రస్తులు తీసుకోకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది.
కర్జూరం
కర్జూరంలో చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల రుచిగానూ ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందే తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. వీటిని తీసుకుంటే త్వరగా శక్తినిస్తాయి. కానీ ఊహించని విధంగా షుగర్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే కర్జూరం తీసుకోకుండా ఉంటేనే మంచిది.
No comments:
Post a Comment